News February 24, 2025

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

పది, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహనపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News December 25, 2025

‘శంబాల’ మూవీ రివ్యూ&రేటింగ్

image

ఆకాశం నుంచి ‘శంబాల’ గ్రామంలో ఉల్క పడిన తర్వాత ఏం జరిగిందనేదే కథ. సైన్స్, మూఢనమ్మకాలను లింక్ చేస్తూ థ్రిల్లింగ్ అంశాలతో డైరెక్టర్ యుగంధర్ కథను నడిపించారు. హీరో ఆది సాయికుమార్ నటనతో మెప్పించారు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. శ్రీచరణ్ మ్యూజిక్ మూవీకి ప్లస్. VFXలో క్వాలిటీ లోపించింది. ఫస్టాఫ్‌ మరింత ఎడిట్ చేయాల్సింది. ఊహకందే కథనం, రొటీన్ క్లైమాక్స్ మైనస్.
రేటింగ్: 2.75/5

News December 25, 2025

42 మందితో విజయనగరం టీడీపీ పార్లమెంటరీ వర్గం

image

విజయనగరం జిల్లా పార్లమెంటరీ కార్యవర్గాన్ని టీడీపీ ప్రకటించింన సంగతి తెలిసిందే. ఇందులో 42 మందికి స్థానం కల్పించింది. ఇందులో తొమ్మిది మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులను, కార్యదర్శులకు అవకాశమిచ్చింది. మొత్తంగా 13 మంది మహిళలకు స్థానం లభించింది. కాగా నూతన కార్యవర్గంలో బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు.

News December 25, 2025

3,073పోస్టులు.. ఆన్సర్ కీ విడుదల

image

<>స్టాఫ్<<>> సెలక్షన్ కమిషన్ CAPF, ఢిల్లీ పోస్ట్ విభాగంలో ఎస్సై పోస్టుల భర్తీకి డిసెంబర్ 9 నుంచి 12 వరకు నిర్వహించిన పేపర్ 1 పరీక్షల ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రర్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి షిఫ్ట్‌ల వారీగా ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరం ఉంటే DEC 27వరకు క్వశ్చన్‌కు రూ.50 చెల్లించి తెలుసుకోవచ్చు. SSC 3,073 పోస్టుల భర్తీకి OCT 16వరకు దరఖాస్తులు స్వీకరించింది.