News March 15, 2025
పరీక్షలు ప్రశాంతంగా రాయండి: KMR కలెక్టర్

ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని ఎవరు ఒత్తిడికి లోను కావద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన పిట్లంలో పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ZPHSలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడే వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
Similar News
News March 15, 2025
చెత్తతో పేరుకుపోయిన భద్రాచలం బస్టాండ్..!

నిత్యం వేలాదిమంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతం భద్రాచలం బస్టాండు. భద్రాద్రి రాముడి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది ఈ బస్టాండ్ ద్వారా ప్రయాణాలు సాగిస్తారు. అలాంటి రద్దీ గల బస్టాండ్ ప్రాంగణంలో చెత్త పేరుకుపోయి దుర్వాసనను వెదజల్లుతోంది. సరైన సౌకర్యాలు లేక ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం గల బస్టాండును పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
News March 15, 2025
ప్రకాశం: ఈనెల 19న మెగా జాబ్ మేళా

ఈనెల 19న ఒంగోలులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్‌లో శనివారం జాబ్ మేళా ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 10 నుంచి పీజీ వరకు చదివిన యువత జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.
News March 15, 2025
కొమురవెల్లికి బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు!

జనగామ బస్టాండ్‌లో కొమురవెల్లికి వెళ్లే భక్తులకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా ఒక్క బస్సు కూడా రావడం లేదని వాపోతున్నారు. జాతరకు వెళ్లే భక్తులకు సరైన బస్సు సౌకర్యాలు అందించాలని పలువురు కోరుతున్నారు. అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.