News April 6, 2025

పర్చూరు: శ్రీరామ పట్టాభిషేకానికి 1818 నాటి రాగి నాణెం

image

బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడులోని పురాతన కోదండరామ స్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆదిపూడి గ్రామానికి చెందిన కాల్వ రఘు రామయ్య శ్రీరాముడి పట్టాభిషేకానికి సంబంధించి 1818లో ముద్రించిన రాగి నాణేలను ప్రదర్శించారు. ఆనాటి నాణేన్ని చూడడానికి ఆసక్తిగా గ్రామ ప్రజలు ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఆలయంలో సందడినెలకొంది.

Similar News

News April 17, 2025

గద్వాల: ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిస్ మేళా

image

గద్వాల ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో ప్రధానమంత్రి నేషనల్  అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సత్యనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వివిధకంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్‌తో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 17, 2025

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఇలా..

image

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.0°C నమోదు కాగా, రామడుగు 40.9, జమ్మికుంట 40.8, మానకొండూర్ 40.7, చిగురుమామిడి, తిమ్మాపూర్ 40.3, చొప్పదండి, కరీంనగర్ రూరల్ 40.2, కరీంనగర్, గన్నేరువరం 40.0, శంకరపట్నం, కొత్తపల్లి 39.9, వీణవంక 39.3, హుజూరాబాద్ 38.7, ఇల్లందకుంట 38.6, సైదాపూర్ 38.1°C గా నమోదైంది.

News April 17, 2025

మంత్రి పొన్నం అపాయింట్‌మెంట్ కావాలా!

image

మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయన్ను కాలవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ‘మంత్రి అపాయింట్‌ మెంట్ కావాలంటే 9959226407 నంబర్‌కు మెసేజ్ చేయాలని’ ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన మంచి ఫలితాలను ఇస్తుందని మంత్రి కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.

error: Content is protected !!