News March 23, 2025
పర్చూరుకు రానున్న సీఎం చంద్రబాబు

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్నారు. చంద్రబాబు బాబు పర్యటన ఖరారు అయినట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ జె. వెంకట మురళి ఆదివారం సమావేశం నిర్వహించారు.
Similar News
News March 28, 2025
నారాయణపేట: ‘250 గజాల ప్లాట్‌కు రూ.45 లక్షల LRS’

ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం LRS విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో రూ.1,000 కట్టి LRSకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు బాబోయ్ ఇదేం LRS అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ పట్టణంలో 250 గజాల భూమికి రూ.45 లక్షలు LRS రావడంతో ప్లాటు అమ్మినా అంత డబ్బు రాదని, ప్రభుత్వం పేదల కడుపు కొట్టేందుకే LRSను ప్రవేశపెట్టిందని బాధితులు మండిపడుతున్నారు.
News March 28, 2025
అధికారులకు బాపట్ల కలెక్టర్ ఆదేశాలు

ఇసుక రీచ్‌లలో ఇసుక నిల్వల పెంపుపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఇసుక రీచ్‌లలో ఉన్న ఇసుక నిల్వలపై గనుల శాఖ అధికారులతో ఆయన ఆరా తీశారు.
News March 28, 2025
కొండగట్టు: చిన్న జయంతి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి చిన్న జయంతి ఉత్సవాలు సమీపిస్తున్నందున.. ఉత్సవ ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆమె ఆలయ పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి కలియతిరిగారు. ఆమె వెంట ఆర్డీవో మధుసూదన్, ఈవో శ్రీకాంత్ రావు, తహసీల్దార్ మునీందర్, ఆరై తిరుపతి, పర్యవేక్షకులు, సిబ్బంది ఉన్నారు.