News March 20, 2025

పర్యాటకులను మెప్పించేలా మరుగుదొడ్లు: కమిషనర్ 

image

వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం నగరంలోని కేటీ రోడ్, జక్కంపూడి, వైవీఆర్ ఎస్టేట్స్, పాతపాడు, అయోధ్య నగర్ ప్రాంతాలను గురువారం పరిశీలించారు. పబ్లిక్ టాయిలెట్లు పర్యాటకులను ఆకర్షించేలా ఉండాలన్నారు. నూతన మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులకు సూచించారు. మహిళల కోసం ప్రతి సర్కిల్లో పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న STP లు, రిజర్వాయర్లు, పిగ్ షెడ్ పనులను వేగంగా పూర్తిచేయాలని అన్నారు.

Similar News

News March 28, 2025

సంగారెడ్డి: భార్య సూసైడ్‌కు కారణమైన భర్తకు జైలు శిక్ష

image

ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, వెయ్యి రూపాయల నిర్మాణ విధిస్తూ సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం రాధాకృష్ణ చౌహన్ గురువారం తీర్పు ఇచ్చారు. ఇస్మాయిల్‌కన్‌పేటకు చెందిన లక్ష్మయ్య మద్యానికి బానిసై భార్య యాదమ్మను వేధించేవాడు. మద్యం తాగి వచ్చి భార్యను వేధిడంతో 2019లో ఆత్మహత్య చేసుకుంది. ఈకేసులో నేరం నిరూపణ కావడంతో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

News March 28, 2025

చార్‌ధామ్ యాత్ర.. వీడియోలు, రీల్స్ చిత్రీకరణపై నిషేధం

image

ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర సందర్భంగా ఆలయాల ప్రాంగణంలో యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లపై నిషేధం ఉండనుంది. ఆలయ ప్రాంగణంలో వీడియోలు, రీల్స్ చేస్తూ ఎవరైనా దొరికితే వారికి దర్శనం నిరాకరించి తిరిగి పంపించేస్తామని కేదార్‌నాథ్-బద్రీనాథ్ పాండా సమాజ్ ప్రకటించింది. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి తలుపులు, మే 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి.

News March 28, 2025

జగిత్యాల: మెరుగైన విద్యుత్ అందించడానికి లైన్లలో కెపాసిటర్ల బిగింపు : SE

image

జగిత్యాల సర్కిల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడానికి విద్యుత్ లైన్లలో కెపాసిటర్లను అమర్చుతున్నామని జగిత్యాల జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియానాయక్ గురువారం తెలిపారు. వోల్టేజ్ లో విద్యుత్ హెచ్చు తగ్గులు లేకుండా కెపాసిటర్లు ఉపయోగపడతాయని అన్నారు. ఇప్పటివరకు 41 కెపాసిటర్లు బిగించామని తెలిపారు. వీటివల్ల ట్రాన్స్ఫార్మర్స్‌పై లోడ్ తగ్గి మోటార్లు కాలిపోకుండా ఉంటాయి

error: Content is protected !!