News October 30, 2024

పర్యావరణహిత దీపావళి జరుపుకోండి: విశాఖ సీపీ

image

పర్యావరణహిత దీపావళిని జరుపుకోవాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. విశాఖలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పశు, పక్షాదులకు, వృద్ధులు, పిల్లలకు హాని కలగకుండా సంప్రదాయ బద్దంగా దివ్వెల పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Similar News

News January 25, 2025

విశాఖలో ఈ రోజు జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు

image

విశాఖలో శనివారం జరిగే ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వాహకులు తెలిపారు.➣ఉదయం 7.30కి సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్, సైబర్ సెక్యూరిటీ అంశంపై బీచ్ రోడ్డు, తెలుగు తల్లి విగ్రహం నుంచి వాకథాన్➣ఉదయం 10గంటలకు TDP కార్యాలయంలో హోంమంత్రి అనిత ప్రెస్ మీట్➣ఉదయం 10 గంటలకు KGHలో వెల్నెస్ సెంటర్ ప్రారంభం➣ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ ప్రెస్ మీట్➣మధ్యాహ్నం 12 గంటలకు ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి అంశంపై CPM సదస్సు

News January 25, 2025

విశాఖ పోర్టుకు కార్డేలియా క్రూజ్‌ షిప్‌

image

కార్డేలియా క్రూజ్‌ షిప్‌ విశాఖ పోర్టుకు రానుంది. పోర్టు యాజమాన్యం కృషి ఫలితంగా ఈ షిప్‌ పుదుచ్చేరి, చెన్నై- విశాఖల మధ్య ఆగస్టు 4 నుంచి 22 వరకు 3 సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. జీఏసీ షిప్పింగ్ (ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) ఈ షిప్‌కు ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పోర్ట్ కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.

News January 25, 2025

బ్యాంక్ అధికారులతో సమావేశమైన విశాఖ సీపీ

image

విశాఖ నగరంలో బ్యాంక్ అధికారులతో సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం సమావేశం అయ్యారు. సైబర్ క్రైమ్ బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దర్యాప్తు కోసం బ్యాంకులకు పోలీసులు సమాచారం కోరితే నెల రోజులు గడిచినా సమాచారం ఇవ్వడం లేదన్నారు. సైబర్ క్రైమ్, ఏటీఎంలలో దొంగతనం జరిగినప్పుడు పోలీసులకు బ్యాంక్ అధికారులు సహకరించాలన్నారు. బ్యాంకులు, పోలీసులు పరస్పర సహకారంతో బాధితులకు న్యాయం చేయొచన్నారు.