News February 6, 2025

పలమనేరు: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

image

పలమనేరులో అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గంటావూరుకు చెందిన షౌకత్ అల్లి అనే వ్యక్తి ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను లారీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. గత కొంతకాలంగా అప్పువాళ్లు వచ్చి ఇంటిముందు అడుగుతుండడంతో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు గమనించి హాస్పిటల్ తీసుకొని వెళ్లేసరికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Similar News

News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. 6వ స్థానంలో CM చంద్రబాబు

image

CM చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు ఇతర మంత్రులతోపోటీ పడి 6వ స్థానంలో నిలిచారు. కాగా చంద్రబాబు సాధారణ పరిపాలన, శాంతి భద్రతల శాఖను చూస్తున్న విషయం తెలిసిందే. మరింత వేగంగా పని చేయాలని CM మంత్రులను ఆదేశించారు.

News February 6, 2025

నీటి ఎద్దడిపై చిత్తూరు కలెక్టర్ సమీక్ష 

image

రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఈఓపీఆర్డీలతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. అధికారులు నీటి ఎద్దడి గ్రామాల వివరాలను తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

News February 6, 2025

బైరెడ్డిపల్లి: హైవేపై ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

బైరెడ్డిపల్లి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వి.కోట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బైరెడ్డిపల్లి మండలం మిట్టపల్లికి చెందిన మునెప్పగా గుర్తించారు. అతనికి మతిస్తిమితం సరిగా లేదని తెలుస్తోంది.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!