News March 27, 2025
పలాస: పెళ్లయినా 50 రోజులకు యువకుడి మృతి

పలాసలోని మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా యువకుడు పెళ్లయిన 50 రోజులకు మృతి చెందినట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. మండలంలోని గొల్లమాకన్నపల్లికి చెందిన మధు(28) సింగుపురానికి చెందిన ఓ యువతని ప్రేమించి ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకున్నాడు. మంగళవారం రాత్రి కోసంగిపురం ప్లై ఓవర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 1, 2025
SKLM: హెడ్ కానిస్టేబుల్‌ను సత్కరించిన జిల్లా ఎస్పీ

శ్రీకాకుళం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో సుమారు 41సంవత్సరాలు పాటు హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసిన పి. కృష్ణమూర్తి మార్చి 31న (సోమవారం) ఉద్యోగ విరమణ చెందారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కృష్ణమూర్తికి శాలువా, పూల దండతో సత్కరించారు. అనంతరం జ్ఞాపికను ప్రధానం చేసి పోలీస్ అధికారుల సమక్షంలో ఆత్మీయ వీడ్కోలు పలికారు.
News April 1, 2025
వజ్రపుకొత్తూరు: గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు మృతి

సముద్రంలో గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లుపేట గ్రామానికి చెందిన బొంగు ధనరాజు (35), వంక కృష్ణారావు (40) చనిపోయారు. మృతులకు భార్యాపిల్లలు ఉన్నారు. నలుగురు మత్స్యకారులు వేటకు వెళ్లగా బోటు తిరగబడి ప్రమాదం జరిగింది. ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకారుల మృతిలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 1, 2025
వజ్రపు కొత్తూరు: వేటకి వెళ్లిన మత్స్యకారులు గల్లంతు

వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు మంగళవారం ఉదయం సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియలేదు. వారి కోసం గాలిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.