News January 1, 2025

పలాస: బియ్యం గింజ సైజులో “వెల్కమ్ 2025” లోగో

image

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, బియ్యం గింజ సైజులో ‘వెల్కమ్ 2025 బంగారపు లోగో’ను తయారుచేశారు. పలాస-కాశీబుగ్గ గాంధీనగర్‌కు చెందిన ప్రముఖ సూక్ష్మశిల్పి, స్వర్ణరత్న బ్రహ్మర్షి కొత్తపల్లి రమేష్ ఆచారి. కేవలం 0.30 మిల్లీ గ్రాముల బంగారాన్ని ఉపయోగించి, కేవలం అర సెంటీమీటర్ ఎత్తు, అర సెంటీమీటర్ వెడల్పు ఈ లోగో తయారు చేశారు. సుమారు ఐదు గంటల సమయం పట్టినట్లుగా రమేష్ మంగళవారం తెలిపారు.

Similar News

News January 6, 2025

ఆమదాలవలసలో ప్రేమ పేరుతో మోసం

image

బాలికను ప్రేమ పేరుతో గర్భిణిని చేసిన ఘటన ఆమదాలవలస మండలంలో వెలుగు చూసింది. పట్టణానికి చెందిన కె.రాజు ప్రేమ పేరుతో బాలికకు దగ్గరయ్యాడు. రెండేళ్లుగా ఆమె తల్లిదండ్రులు లేని సమయంలో లైంగికంగా దాడి చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో బాలిక గర్భం దాల్చింది. తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై పోక్సో కేసు నమోదు చేశామని డీఎస్పీ సీహెచ్ వివేకానంద వెల్లడించారు. నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు.

News January 6, 2025

SKLM: జనవరి 8న పోలీస్ PET పరీక్షలు వాయిదా

image

శ్రీకాకుళం జిల్లాలో జనవరి 8న జరుగనున్న పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేసినట్లు ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు వివిధ శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జనవరి 11న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. PET, PMT నోటిఫికేషన్ షెడ్యూల్ మేరకు జనవరి 8 తేది మినహా మిగిలిన తేదీల్లో PET పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు. అభ్యర్థులు గమనించాలని ఎస్పీ స్పష్టం చేశారు.

News January 5, 2025

గార: ఉప్పు గెడ్డలో పడి వృద్ధురాలి మృతి

image

గార మండలం శ్రీకూర్మం పంచాయతీ జెల్లపేటకు చెందిన గండ్రేటి కృష్ణమ్మ (74) ప్రమాదవశాత్తు ఉప్పు గెడ్డలో జారి పడి మృతి చెందింది. శనివారం గార వెళ్తానని చెప్పిన కృష్ణమ్మ బందరువానిపేట వద్ద ఉన్న ఉప్పు గెడ్డలో పడి మరణించడంతో కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ జనార్దన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేశారు.