News May 20, 2024

పల్నాడు అల్లర్లపై డీజీపీకి అందించిన నివేదికలో వివరాలివే..

image

ఎన్నికల రోజు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్ల‌పై సిట్ బృందం నివేదిక రూపొందించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. పల్నాడు జిల్లాలో మొత్తం 22 కేసులు నమోదు అయినట్లు పేర్కొంది. 581 మందిపై కేసు నమోదు చేసి, 19 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. 91 మందికి 41A నోటిసులు జారీ చేసినట్లు తెలిపారు. మరికాసేపట్లో నివేదికను సీఈవో, సీఈసీకి పంపనున్నట్లు తెలుస్తుంది.

Similar News

News December 27, 2024

‘రాష్ట్రానికి క్యూ కడుతున్న దిగ్గజ ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు’

image

అమరావతి: గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రగతిశీల ఆలోచనలతో గత ఆరునెలల్లో రాష్ట్రంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలను పరుగులు తీయిస్తామని యువనేత నారా లోకేశ్ అన్నారు. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రాన్ని ఐటి హబ్ గా మార్చేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు రప్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు.

News December 27, 2024

 గుంటూరు పరేడ్ గ్రౌండ్‌లో దేహధారుడ్య పరీక్షలు

image

పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహధారుణ్య పరీక్షలకు గుంటూరు పోలీస్ పరేడ్ మైదానాన్ని సిద్ధం చేయమని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఐపీఎస్ ఆదేశించారు. డిసెంబర్ 30న పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం నగరంలోని మైదానాన్ని ఎస్పీ పరిశీలించారు. అభ్యర్థులకు ప్రతి పరీక్ష ఘట్టం అర్థమయ్యే రీతిలో మైదానంలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు SPలు GV రమణమూర్తి, సుప్రజ పాల్గొన్నారు.

News December 27, 2024

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: అంబటి

image

మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ మృతిపై వైసీపీ నేత అంబటి రాంబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘పరిపాలనాదక్షుడు, ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు’ అని ట్వీట్ చేశారు. కాగా 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ మరింత క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయన 2004-2014 వరకు ప్రధానిగా సేవలందించారు.