News May 19, 2024

పల్నాడు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకేశ్

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పని చేసిన శివ శంకర్ బదిలీ కావడంతో నూతన కలెక్టర్‌ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్‌ను జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, కలెక్టరేట్లోనే వివిధ విభాగాల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడు జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తారని బాలాజీ తెలిపారు.

Similar News

News December 26, 2024

అమరావతి: శాతవాహనుల రాజధాని ఎక్కడ ఉందో తెలుసా?

image

గౌతమ ధ్యాన బుద్ధ విగ్రహం అమరావతి మండలం ధరణికోటలో ఉంది. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. ఇది కృష్ణా నది ఒడ్డున నాలుగున్నర ఎకరాల స్థలంలో నెలకొల్పబడింది. ఈ ప్రాంతంలో విలసిల్లిన బౌద్ధ సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ కళాఖండాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని శాతవాహనుల రాజధాని అని అంటారు. వీరు హిందూ మతంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా ఆదరించారు. అమరావతి మహాచైత్య స్థూపం శిలాఫలకాల ఆధునిక నకళ్లు ఇక్కడ ఉన్నాయి.

News December 26, 2024

అంబటి రాంబాబు మరో సంచలన ట్వీట్

image

‘పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే’ అంటూ అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పుష్ప-2 సినిమాలో ఓ సన్నివేశానికి సంబంధించిన డైలాగ్‌తో ట్వీట్ చేశారు. కాగా అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ పెద్దలు రేవంత్ రెడ్డిని నేడు కలిసిన సందర్భంలో ఈ ట్వీట్ చేయడంతో నెటిజన్లు దీనిని వైరల్ చేస్తున్నారు.

News December 26, 2024

గుంటూరు: రైల్లో నుంచి పడి మహిళ మృతి

image

రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ రైలు నుంచి జారిపడటంతో గుంటూరుకు చెందిన హేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రైలు నుంచి జారి పడడంతో గోదావరి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాధాకృష్ణ స్థానికులు సాయంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్చగా బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్ఐ లోవరాజు తెలిపారు.