News March 1, 2025

పల్నాడు జిల్లా టాప్ న్యూస్

image

 ★ దాచేపల్లిలో పింఛన్ డబ్బుతో సచివాలయం ఉద్యోగి పరార్ ★ నరసరావుపేట: సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫైర్★ సత్తెనపల్లిలో పరీక్షా కేంద్రం మార్పుపై ఇంటర్ విద్యార్థుల ఆందోళన★ చిలకలూరిపేట: బ్యాంకు కుంభకోణంలో నిందితుడి అరెస్ట్★ పల్నాడు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 759 మంది విద్యార్థులు గైర్హాజరు★ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్..

Similar News

News March 3, 2025

ఆసీస్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై గెలిచి సెమీస్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్ధమైంది. కాగా వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్ పరాభవానికి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. ఈ నెల 4న దుబాయ్ వేదికగా సెమీస్ జరగనుంది. ఆ మ్యాచులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ బాధ వారికి కూడా రుచి చూపించాలని కామెంట్లు చేస్తున్నారు.

News March 3, 2025

వరంగల్: అతిపెద్ద రన్‌‌ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

image

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్‌ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 3, 2025

శ్రీలేఖ పాడె మోసిన కర్నూలు డీఈవో

image

సీ.బెలగల్ మండలం పోలకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి శ్రీలేఖ కర్నూలులో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. గోనెగండ్ల మండలం పెద్దనెలటూరులో జరిగిన విద్యార్థిని అంత్యక్రియలలో ఈడీవో శ్యామ్యూల్ పాల్ పాల్గొని, పాడెమోశారు. అంత్యక్రియలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. కాగా, సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో విద్యార్థినిపై చెట్టు విరిగిపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

error: Content is protected !!