News April 5, 2025
పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

☞ నరసరావుపేట: బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ, ☞ రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో మహిళ తలకు గాయాలు, ☞ గురజాల: అధికార పార్టీపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ ఫైర్, ☞ మాచర్ల: ఎంపీటీసీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పరామర్శ, ☞ చిలకలూరిపేట: యువకుడి ఆత్మహత్య, ☞ దుర్గి: నాటు సారా తయారీ అనర్ధాలపై అవగాహన కల్పించిన అధికారులు, ☞ శావల్యాపురం: అక్రమ మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.
Similar News
News April 7, 2025
చిత్తూరు: ప్రజల నుంచి అర్జీల స్వీకరణ

చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) సోమవారం జరిగింది. ఇందులో భాగంగా ప్రజల నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. డీఆర్వో మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు విజయ లక్ష్మి, అనుపమ, కలెక్టరేట్ ఏవో కులశేఖర్ తదితరులు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తామన్నారు.
News April 7, 2025
బాటసింగారానికి భారీగా వస్తున్న మామిడికాయలు

బాటసింగారంలోని పండ్ల మార్కెట్‌కి భారీగా మామిడికాయలు వస్తున్నాయి. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి మామిడికాయల లారీలు పోటెత్తుతున్నాయి. సీజన్ ఆరంభంలోనే పెద్ద ఎత్తున మామిడికాయలు రావడంతో సీజన్ చివరి వరకు కనీసం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఒక్కరోజే 300 ట్రక్కుల్లో సుమారు 7వేల టన్నుల పంట వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News April 7, 2025
ఎమ్మెల్సీ మల్క కొమురయ్యను అభినందించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మల్క కొమురయ్యను సోమవారం ఐటి పరిశ్రమ, వాణిజ్యం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అభినందించారు. కాగా, మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్యలు పెద్దపల్లి జిల్లాకు చెందినవారు. వీరు పార్టీలు వేరైనప్పటికీ మంచి మిత్రులు కావడం కొసమెరుపు.