News April 21, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ నరసరావుపేటలో నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ డే
☞ వినుకొండలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
☞ వెల్దుర్తి: రోడ్డు ప్రమాదంలో హార్టికల్చర్ ఉద్యోగికి తీవ్ర గాయాలు
☞ చిలకలూరిపేట: బొమ్మల షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
☞ సత్తెనపల్లిలో వివాహిత అనుమానాస్పద మృతి
☞ రొంపిచర్ల: 6తరగతి ప్రవేశ పరీక్షలకు 221 మంది హాజరు
Similar News
News April 22, 2025
BPL: చోరీకి పాల్పడిన మహిళ, మైనర్ల అరెస్ట్: CI

ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అబ్సలుద్దీన్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో పెండ్లి బరాత్ సమయంలో జ్యోతి అనే మహిళ ఇంట్లో ఎవరూ లేరు. ఆ సమయంలో ఇంట్లోకి చొరబడి బంగారం, డబ్బులు దొంగతనం చేసిన స్వప్న, మరో ఇద్దరు మైనర్లను CC టీవీ కెమెరాల ఆధారంగా గుర్తించామన్నారు. సోమవారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
News April 22, 2025
NGKL: జైలుకు గ్యాంగ్ రేప్ నిందితులు

ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై గ్యాంగ్ రేప్ చేసిన ఏడుగురు నిందితుల పోలీస్ కస్టడీ సోమవారంతో ముగిసింది. కల్వకుర్తి డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏడుగురిని కస్టడీ తీసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. నిందితులు దేవాలయం సమీపంలో గతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరిగినట్లు సమాచారం. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు.
News April 22, 2025
భీంపూర్: రైతు బిడ్డకు బ్యాంక్ మేనేజర్ కొలువు

భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన అడెపు అశోక్, కళావతి వారికి ఉన్న 3 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేస్తూ.. కూలి పనులు చేసుకుంటున్నారు. వారి కొడుకు శ్రీకాంత్ సోమవారం వెలువడిన బ్యాంక్ ఫలితాల్లో సత్తాచాటారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో ఆ పేద తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా గ్రామస్థులు శ్రీకాంత్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.