News April 23, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ జిల్లాలో టెన్త్ టాపర్స్‌ను అభినందించిన కలెక్టర్ ☞ అమరావతిలో ఉగ్ర దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ ☞ పిడుగురాళ్లలో సందడి చేసిన హీరోయిన్ మెహరీన్ ☞ సత్తనపల్లిలో పోలీసుల తనిఖీలు ☞ నకరికల్లు పోలీస్ స్టేషను తనిఖీ చేసిన ఎస్పీ ☞ పెద్దకూరపాడులో యువకుడిపై దాడి
Similar News
News April 25, 2025
కామారెడ్డిలో భగభగ.. ఆరెంజ్ అలర్ట్!

భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. నిన్నటి కామారెడ్డి జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత మెనూర్‌లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా పిట్లంలో 41.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
News April 25, 2025
పెద్దపల్లి: 28న యువ వికాసం దరఖాస్తుల పరిశీలన: కమిషనర్

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఈ నెల 28వ తేదీన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. పరిశీలన అనంతరం అర్హుల జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 40 వేలకు పైగా దరఖాస్తులు అందాయని తెలిపారు. అర్హత ప్రమాణాల ఆధారంగా దరఖాస్తులను సక్రమంగా పరిశీలిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
News April 25, 2025
పెద్దపల్లిలో పహల్గం మృతులకు జర్నలిస్టుల నివాళులు

పహల్గం ఘటనలో మృతిచెందిన భారతీయులకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద జర్నలిస్టులు గురువారం రాత్రి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దేశ భద్రతతో రాజీపడకుండా కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శత్రుదేశం వెన్నులో వణుకు పుట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.