News March 16, 2025
పల్నాడు జిల్లాలో నిలకడగా చికెన్ ధరలు

పల్నాడు జిల్లాలో చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. లైవ్ కోడి కేజీ రూ.95, స్కిన్‌లెస్ రూ.200లు , స్కిన్‌తో రూ.180లుగా ఉంది. నాటుకోడి రూ.500ల నుంచి రూ.750ల వరకు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలలో మార్పులేదు. మటన్ ధర కేజీ రూ.1,000లుగా ఉంది. 100 కోడిగుడ్లు రూ.460-480 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో చికెన్‌కు ఆదివారం డిమాండ్ కొనసాగుతోంది.
Similar News
News March 18, 2025
PDPL: భారీ వాహనాల స్పీడ్.. గాలిలో కలుస్తున్న ప్రాణాలు

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మట్టి, బూడిద రవాణా చేసే భారీ వాహనాలతో విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. గత వారం రోజుల పరిధిలో అంతర్గాం సమీపంలో కుమార్ అనే యువకుడిని మట్టి టిప్పర్ ఢీకొని మరణించారు. నిన్న మల్యాలపల్లి సబ్ స్టేషన్ సమీపంలో బండి ప్రసాద్ గౌడ్ అనే సింగరేణి కార్మికుడు బూడిద టిప్పర్ ఢీకొని మరణించాడు. డ్రైవర్ల అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు భాస్తున్నారు.
News March 18, 2025
గద్వాల: చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఈ నెల 15న పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నించిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాలు.. ధరూర్ మండలం మన్నాపూర్‌కి చెందిన అబ్రహాం(21) కుటుంబకలహాలు భరించలేక పురుగుమందుతాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
News March 18, 2025
MBNR: కారు టైర్ పగిలి రోడ్డు ప్రమాదం.. తాత, మనవడు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై<<15788272>> ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. NGKL జిల్లా బిజినేపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి(76) MBNRలో నివాసముంటున్నారు. ఆయన కూతురు శ్వేత(45), ఈమె కొడుకు నిదయ్‌రెడ్డి(22)లు HYDలో ఉంటున్నారు. వీరు ముగ్గురు కారులో HYD నుంచి జడ్చర్లకు వస్తున్నారు. మాచారం సమీపంలో టైరుపగిలి అవతలివైపు వస్తున్న బస్సును ఢీకొట్టగా తాత, మనవడు మృతిచెందారు. శ్వేత పరిస్థితి విషమంగా ఉంది.