News March 21, 2025
పల్నాడు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై JC సమీక్ష

పల్నాడు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్ల కేటాయింపు, చిన్న, సూక్ష్మత రహ పరిశ్రమలకు ప్రోత్సాహంపై చర్చించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ అనుమతుల పురోగతి గురించి చర్చించారు. మార్చి నెలలో 129 దరఖాస్తులు రాగా.. 122 ఆమోదించబడ్డాయని కమిటీ తెలిపింది. బ్యాంకులలో రుణాలు వేగంగా ఉండాలన్నారు.
Similar News
News March 31, 2025
పోలీస్ స్టేషన్‌గా మారిన వికారాబాద్ RDO ఆఫీస్

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం పోలీస్ స్టేషన్‌గా కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని వెబ్ సిరీస్ షూటింగ్ నిర్వాహకులు పోలీస్ కార్యాలయంగా మార్చారు. ఆదివారం సెలవు ఉండడంతో షూటింగ్ కోసం అనుమతి ఇచ్చారు. దీంతో నిర్వాహకులు ఆఫీస్‌ను ఇలా పోలీస్ స్టేషన్‌గా మార్చేశారు.
News March 31, 2025
కృష్ణా: నేటి ‘మీకోసం’ కార్యక్రమం రద్దు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే కార్యక్రమం రద్దయినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే అర్జీ దారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి ‘మీకోసం’ కార్యక్రమం వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.
News March 31, 2025
నాగార్జున సాగర్ సమాచారం

☞పూర్తిస్థాయి నీటి మట్టం – 590.00 అడుగులు
☞టీఏంసీలు – 312.0450
☞ప్రస్తుత నీటిమట్టం – 521.70
☞టీఏంసీలు – 152.3944
☞ఎడమ కాల్వకు నీటి విడుదల – 7190
☞కుడికాల్వకు – 5088
☞విద్యుత్ కేంద్రం ద్వారా – 0
☞క్రస్ట్ గేట్ల ద్వారా – 0
☞ఎస్‌ఎల్‌బీసీ ద్వారా – 1300 క్యూసెక్కులు
☞వరద కాల్వ ద్వారా – 300 క్యూసెక్కులు
☞ఇన్‌ఫ్లో – 0
☞అవుట్‌ఫ్లో – 13.938 క్యూసెక్కులు
☞ఎన్ని గేట్ల ద్వారా – నిల్