News March 26, 2025

పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలపై సీఎం సమీక్ష 

image

పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్ పి. అరుణ్ బాబుతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు రక్షణ, ప్రశాంత వాతావరణం అందించామని వారు సీఎంకు తెలిపారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి శక్తి యాప్ వంటి వాటిపై ఎస్పీ నుంచి సీఎం సమాచారం తీసుకున్నారు.

Similar News

News April 1, 2025

అలంపురం పుణ్యక్షేత్రంలో రమణీయంగా రథోత్సవం

image

శ్రీశైలం మహా క్షేత్రానికి పశ్చిమ ద్వారమైన అలంపురం పుణ్యక్షేత్రంలో వెలసిన బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం రాత్రి రథోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధల మధ్య రమణీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి, అమ్మవారి ఉత్సవ మూర్తుల విగ్రహాలను రథంలో కూర్చో బెట్టి ఆలయం చుట్టూ ఊరేగించారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ స్వామివారి విగ్రహాలను ఆలయ ప్రాకార మండపంలో రథం ఊరేగించారు.

News April 1, 2025

పొందుర్తిలో రైతు ఆత్మహత్య

image

రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన స్వామి రెండు ఎకరాల్లో పంట సాగు చేసినట్లు చెప్పారు. బోరులో నీటిమట్టం తగ్గిపోవడంతో చేతికొచ్చే పంట ఎండిపోవడాన్ని తట్టుకోలేక తన ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News April 1, 2025

ఏప్రిల్ 1: చరిత్రలో ఈరోజు

image

1578: రక్తప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం 1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ స్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ జననం
1935: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన
1936: ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
1941: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ జననం
2022: తెలుగు చిత్ర దర్శకుడు శరత్ మరణం

error: Content is protected !!