News May 25, 2024

పల్నాడు: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధం

image

నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో జూన్ 4న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని గురజాల, మాచర్ల, సత్తెనపల్లి నరసరావుపేట, పెదకూరపాడు, వినుకొండ, చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19027 ఓట్లు నమోదు కాగా.. ఒక్కో టేబుల్‌కు 1058 ఓట్ల చొప్పున 18 టేబుల్స్ సిద్ధం చేస్తున్నారు.

Similar News

News March 14, 2025

గుంటూరు: 10th విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఈనెల 17 నుంచి 31వరకు పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుంటూరు జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి రవికాంత్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ని కండక్టర్‌కి చూపించి తమ గ్రామాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చని చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఈ అవకాశం కల్పించామన్నారు. దీనిపై మీ కామెంట్.

News March 14, 2025

మద్దతు ధరలకు రబీ పంటల కొనుగోలు: జేసీ 

image

గుంటూరు జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో పండించిన మినుములు, శనగలు, పెసలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు జేసీ భార్గవ్ తేజ గురువారం తెలిపారు. మినుములకు క్వింటాలుకు రూ.7,400లు, శనగలు రూ.5,650లు, పెసలు రూ.8,682లు కనీస మద్దతు ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ-క్రాప్లో నమోదు చేసుకున్న రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించదలుచుకుంటే ఈనెల 15వ తేదీ నుంచి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 

News March 14, 2025

పిల్లలతో అన్ని సమస్యలు గురించి చర్చించాలి: DMHO

image

గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం పిల్లలపై లైంగిక దాడులను నివారించడంపై ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటెక్షన్, ఎంఈఓలు ప్రోగ్రాం అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు స్నేహపూరితమైన వాతావరణంలో పిల్లలతో అన్ని సమస్యలు గురించి చర్చించాలని, అప్పుడే పిల్లలు అన్ని విషయాలు పంచుకుంటారన్నారు. తద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపవచ్చన్నారు. 

error: Content is protected !!