News March 26, 2025

పల్నాడు: మంత్రి పదవి రేసులో యరపతినేని.?

image

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావుకు ప్రాతినిధ్యం కల్పించాలని TDP కార్యకర్తలు బలంగా వాదన వినిపిస్తున్నారు. MLC నాగబాబుకు మంత్రి మండలిలో చోటు కల్పించేందుకు విస్తరణ చేపట్టనున్నారు. క్యాబినెట్‌లో పల్నాడుకు ప్రాతినిధ్యం లేదు. గురజాల నుంచి వరుసగా 7 సార్లు పోటీ చేసి TDPలో 3 తరాలతో పనిచేసిన యరపతినేనికి మంత్రి మండలిలో బెర్త్‌పై ప్రచారం జరుగుతోంది.

Similar News

News March 29, 2025

భూపాలపల్లి: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

భూపాలపల్లి జిల్లా ప్రజలకు ఎస్పీ కిరణ్ ఖారె ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది కొత్త సంవత్సరానికి ఆరంభసూచిక అని అన్నారు. ఈ శుభ సందర్భంలో ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, శాంతి కలగాలని కోరుకుంటున్నానన్నారు. అలాగే ప్రజలు శాంతి, భద్రతలను పాటిస్తూ ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు.

News March 29, 2025

మెట్రో రైలు ప్రయాణ వేళలు పొడిగింపు

image

HYD మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉదయం 6 – రాత్రి 11.45 వరకు సర్వీసులు ఉంటాయని మెట్రో వెల్లడించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ టైమింగ్స్ అమలు చేస్తామని చెప్పింది. అలాగే టెర్మినల్ స్టేషన్‌ల నుంచి ఆదివారాల్లో మొదటి రైలు ఉ.7 గంటలకు ప్రారంభం అవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం మెట్రో రైలు సర్వీసులు ఉ.6 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటున్న విషయం తెలిసిందే.

News March 29, 2025

ఉగాది సుఖసంతోషాలతో గడుపాలి: ఎస్పీ

image

ఉగాది పర్వదినాన్ని జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎస్పీ మణికంఠ శనివారం కోరారు. నూతన సంవత్సరంలో అందరికీ ఆరోగ్యం, ఆయుషు, ఆనందం, అభివృద్ధి కలగాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ప్రజలకు పోలీసు శాఖ తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

error: Content is protected !!