News March 29, 2025
పల్నాడు: మాతృ మరణాలపై ప్రత్యేక సమావేశం

పల్నాడు జిల్లాలో మాతృ మరణాలపై ప్రత్యేక సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గర్భిణీలకు శ్రద్ధతో వైద్య పరీక్షలను అందించాలన్నారు. జిల్లాలో ఎడ్లపాడు, సిరిగిరిపాడు, ఆరేపల్లి, ముప్పాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాల గురించి చర్చించారు. రక్తహీనత సమస్యలు ఉంటే వెంటనే వైద్యం అందించాలని, ప్రసవ సమయంలోను జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News April 3, 2025
ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది.
* ప్రత్యేక వాహక ప్రాజెక్టుగా పోలవరం-బనకచర్ల
* ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి డ్రోన్ కార్పొరేషన్‌ను విడదీసి స్వతంత్ర సంస్థ ఏర్పాటు
* అనకాపల్లి డీఎల్‌పురంలో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ కంపెనీకి షరతులపై క్యాపిటల్ పోర్టు అప్పగింత
* త్రీస్టార్, ఆ పైబడిన హోటళ్ల బార్ లైసెన్స్ ఫీజులు రూ.25 లక్షలకు తగ్గింపు
News April 3, 2025
సిరాజ్‌పై సెహ్వాగ్ ప్రశంసలు

IPLలో సత్తా చాటుతున్న GT బౌలర్ సిరాజ్‌పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. కొత్త బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నారని పేర్కొన్నారు. తిరిగి టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవాలనే కసితోనే ఆడుతున్నారని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కకపోవడం ఆయనను హర్ట్ చేసిందన్నారు. కాగా ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లో సిరాజ్ 5 వికెట్లు తీశారు.
News April 3, 2025
BREAKING.. గద్వాల: బాలుడి తల, మొండెం వేరైంది!

మల్దకల్ మండలంలో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని నీలిపల్లి గ్రామంలో తల్లిదండ్రుల వెంట ఎనిమిదేళ్ల జీవన్ వరి పొలం దగ్గరికి వెళ్లాడు. వారు వరికోత యంత్రంతో పొలంలో పనులు చేయిస్తున్నారు. బాలుడు ఆడుకుంటూ మిషన్ దగ్గరికి వెళ్లడంతో.. అది ఆ బాలుడి మీది నుంచి వెళ్లింది. దీంతో బాలుడి తల, శరీరం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.