News March 28, 2025
పల్నాడు: సైన్స్ పరీక్షలకు 98.70 శాతం హాజరు

పల్నాడు జిల్లాలో శుక్రవారం జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షలకు 98.70 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 128 సెంటర్లలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. మొత్తం 25,690 మంది విద్యార్థులకు గాను పరీక్షలకు 25,347 మంది విద్యార్థులు హాజరయ్యారు. 22 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లు, 13 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు పరీక్షలను పర్యవేక్షించారని డీఈవో చెప్పారు.
Similar News
News April 3, 2025
ఇండోనేషియాలో భూకంపం

ఆగ్నేయాసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నార్త్ హల్మహేరకు 121 కి.మీ. దూరంలో సముద్రంలో 42 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతాలు వణికిపోయాయి. 30 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, సునామీ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు.
News April 3, 2025
GREAT: గ్రూప్ 1లో మెరిసిన పాలమూరు ఆణిముత్యం

మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన శ్రీనివాస్ గౌడ్ కుమార్తె నందిని కలాల్ గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటారు.TSPSC గ్రూప్-1 పరీక్షలో 467 మార్కులతో సత్తా చాటి తొలి ప్రయత్నంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే 281వ ర్యాంకు సాధించారు. గ్రూప్-2, 3లో కూడా ఆమె అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు Way2Newsకు తెలిపారు. గ్రూప్-1లో ఎంపిక కావడం సంతోషంగా ఉందని,UPSC తన లక్ష్యమంటూ పేర్కొన్నారు. #CONGRATULATIONS
News April 3, 2025
పురుషులకూ సంతానోత్పత్తి నిరోధక మాత్రలు!

USA సైంటిస్టులు విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు.
ఇంతకాలం స్త్రీలకే గర్భ నిరోధక మాత్రలుండగా, ఇప్పుడు పురుషులకూ సంతానోత్పత్తి నిరోధకాలు అభివృద్ధి చేశారు. ‘YCT-529’ పేరు గల ఈ మెడిసిన్ ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్లను నియంత్రిస్తుంది. ఎలుకలు, కొన్ని క్షీరదాలపై దీన్ని ప్రయోగించగా వాటి స్పెర్మ్ కౌంట్ తగ్గి సానుకూల ఫలితాలు వచ్చాయట. మెడిసిన్ వాడకం ఆపిన 6 వారాలకు తిరిగి సామర్థ్యం పొందాయి.