News February 12, 2025

పల్నాడులో తగ్గిన చికెన్ ధరలు 

image

పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ ధరలు దిగివస్తున్నాయి. 10 రోజుల క్రితం కేజీ చికెన్ రూ.280 వరకు ఉంది. ప్రస్తుతం ఈ ధర రూ. 240-260 వరకు విక్రయిస్తున్నారు. తెలంగాణ, గోదావరి జిల్లాల నుంచి దిగుమతి అవుతున్న కోళ్లకు సంబంధించి వ్యాపారులకు లైవ్ కోడి కేజీ రూ.50-60లు, చికెన్ రూ. 150-160ల వరకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ధర తక్కువ ఉన్న చికెన్ పట్ల ప్రజలలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

Similar News

News February 12, 2025

అనంత: ‘బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయిన బాలుడు.. వివరాలు తెలిస్తే చెప్పండి’

image

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ కొండ మీదరాయుడి బ్రహ్మోత్సవాల్లో ఓ బాలుడు తప్పిపోయాడు. కనీసం తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే బుక్కరాయసముద్రం సీఐకి సమాచారం అందించాలని తెలిపారు.

News February 12, 2025

భద్రాచలం రాములవారి పెళ్లికి గజ్వేల్ నుంచి తలంబ్రాలు..

image

శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం కోసం వాడే గోటి తలంబ్రాల(గోటితో వలిచిన బియ్యం)ను వలిచే అవకాశాన్ని ఈసారి గజ్వేల్‌లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థకు భద్రాచల దేవస్థానం కల్పించింది. ఈ మేరకు 250కిలోల వడ్లను గోటితో వలచి తలంబ్రాలుగా మలచనున్నారు. ఈ మహత్కార్యంలో పాల్గొనే అవకాశం వచ్చిన శ్రీరామకోటి భక్త సమాజం సభ్యులు రామారాజును ఎమ్మెల్సీ యాదవరెడ్డి బుధవారం సన్మానించి అభినందించారు.

News February 12, 2025

KMR: యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి

image

వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ రమేశ్ పేర్కొన్నారు.

error: Content is protected !!