News February 13, 2025

పల్నాడులో లెదర్ పార్క్ ఏర్పాటు: ఎంపీ

image

పల్నాడు జిల్లాలో లెదర్ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని ఎంపీ కృష్ణదేవరాయలు మంత్రి టీజీ భరత్‌ను కలిసి గురువారం విజ్ఞప్తి చేశారు. ఏపీఐఐసీ భవంతిలో ఎంపీ మాట్లాడుతూ.. లెదర్ పార్క్ స్థల పరిశీలన విషయాలను, ప్రాజెక్టుతో కలిగే లబ్ధిని, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాల గురించి వివరించారు. లెదర్ పార్కును ఏర్పాటు చేసేందుకు పల్నాడులో ఉన్న వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను విదేశీ ప్రతినిధి బృందానికి ఎంపీ తెలిపారు.

Similar News

News February 13, 2025

కల్తీ నెయ్యి కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ

image

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితులను పోలీస్ కస్టడీకి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు అనుమతిచ్చింది. నిందితులు శ్రీవైష్ణవి డెయిరీ డైరెక్టర్లు వివేక్ జైన్, పోమిల్ జైన్, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్, అపూర్వ చావ్డాలను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసిన సిట్ అధికారులు అదేరోజు కోర్టులో హాజరుపరిచారు.

News February 13, 2025

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేసిన జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని గురువారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సదరం క్యాంప్ నిర్వహణ తీరును పరిశీలించారు. డాక్టర్లు, రోగులతో మాట్లాడారు. రోగులను క్రమ పద్ధతిలో వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోబెట్టి పిలవాలని సదరం నిర్వాహకులకు చెప్పారు. చర్మ వ్యాధి సోకిన సంవత్సరంన్నర పాప శంకరపల్లి రన్వితను కలెక్టర్ పలకరించారు.

News February 13, 2025

చాగల్లు: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

image

చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన దుర్గాభవాని(35), వివాహిత కుమార్తె కుమారుడు సంతానం ఇటీవల ఆర్థిక ఇబ్బందులు కారణంగా మనస్థాపానికి గురై గురువారం ఆమె పిల్లలతో మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకోంది. చికిత్స నిమిత్తం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్సై నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!