News April 7, 2025

పల్వంచ: తాళం వేసిన ఇంట్లో దొంగతనం

image

పల్వంచ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన సాయిలు శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి వెళ్లరు. తిరిగి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బీరువాలోని మూడు తులాల బంగారం పుస్తెల తాడు, రూ.20,000 నగదును దొంగలించినట్లు పోలీసులు చెప్పారు. అదే గ్రామానికి చెందిన భువనగిరి రాజు ఇంటిలో కూడా తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్ఐ అనిల్ ఆదివారం చెప్పారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Similar News

News April 17, 2025

అనకాపల్లి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సమీక్ష

image

అనకాపల్లి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం అట్రాసిటీ కేసుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా దర్యాప్తులో పూర్తి వివరాలు సేకరించి సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ఎస్పీ తుహీన్ సిన్హా, ఆర్డీవో సత్యనారాయణ రావు పాల్గొన్నారు.

News April 17, 2025

నిడదవోలు: ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

image

నిడదవోలు డిపో నుంచి హైదరాబాద్‌కి RTC నూతన సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. చాగల్లు- పంగిడి -దేవరపల్లి – జంగారెడ్డిగూడెం- ఖమ్మం మార్గంలో ఈ బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కే.వెంకటేశ్వర్లు అన్నారు. రేపు సాయంత్రం 4:30 నిమిషాలకు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు నిడదవోలు ప్రాంత ప్రజలు సర్వీస్‌ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

News April 17, 2025

వినియోగదారులు సంస్థకు సహకరించాలి: ఎస్ఈ

image

వినియోగదారుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ సుదర్శనం తెలిపారు. గురువారం మామడ మండలం తాండ్ర సబ్ స్టేషన్‌లో రెండు ప్రత్యేక బ్రేకర్లకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సంస్థకు సహకరించాలని కోరారు. డీఈ నాగరాజు, ఏఈ బాలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!