News November 13, 2024
పశుగ్రాసాల సాగు చేయటానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం
ఆస్పరి: రైతులకు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా పశుగ్రాసాల సాగు చేయటానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని జేడి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం గ్రామ పశు వైద్య కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఎన్ఎల్ఎం ద్వారా గొర్రెల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. రైతులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 14, 2024
పోసానిపై చర్యలు తీసుకోండి.. బనగానపల్లిలో ఫిర్యాదు
నటుడు పోసాని కృష్ణ మురళిపై చర్యలు తీసుకోవాలని బనగానపల్లి జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. TTD ఛైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని సీఐ ప్రవీణ్ కుమార్కు వారు వినతిపత్రం అందజేశారు. ఆ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తెలిపారు. వెంకటసుబ్బయ్య, గుర్రప్ప, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, జవహర్, వెంకట రాముడు, శేఖర్, ఓబులేసు, నాగేశ్, సుధాకర్ పాల్గొన్నారు.
News November 14, 2024
వెలుగోడులో యువతి ఆత్మహత్య
నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణం ఎస్సీ కాలానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై విష్ణు నారాయణ వివరాల మేరకు.. తల్లిదండ్రులు బయటకి వెళ్లిన సమయంలో 19 ఏళ్ల యువతి ఇంట్లో ఉరేసుకుంది. బంధువుల ఇంటికెళ్లి తిరిగొచ్చిన తల్లిదండ్రులు కూతురి బలవన్మరణాన్ని గమనించి బోరున విలపించారు. అయితే ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
News November 14, 2024
KNL: బాలికపై అత్యాచారయత్నం.. వైసీపీ సర్పంచ్ అరెస్ట్!
కర్నూలు జిల్లా కోసగి మండలంలో 13ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ వైసీపీ నేత, సర్పంచ్ హుసేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు కార్యకర్తలు వినోద్, సూరిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై చంద్రమోహన్ చెప్పారు. వారిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వివరించారు. అత్యాచారయత్నం అనంతరం పరారీలో ఉన్న నిందితులను కోసిగి గ్రామ శివారులో అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.