News February 28, 2025
పశ్చిమ గోదావరి: పశు పోషకులకు గుడ్ న్యూస్

జిల్లాలోని పశువుల రైతులు పశు వ్యాధి నియంత్రణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. మార్చి 1 నుంచి మార్చి 30 వరకు జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, పలు వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా వేయనున్నట్లు తెలిపారు.
Similar News
News March 1, 2025
పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: శ్రీనివాస వర్మ

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం రూ.3.2 లక్షల కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. తెలుగు భాష అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించడంతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలకు నిధులు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News March 1, 2025
ప.గో జిల్లా TODAY TOP HEADLINES

✷భీమవరంలో కన్నుల పండుగగా సోమేశ్వర స్వామి తెప్పోత్సవం ✷ పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్: కేంద్ర సహాయ మంత్రి వర్మ ✷ బడ్జెట్ నిరుత్సాహపరిచేలా ఉంది: టీచర్ ఎమ్మెల్సీ గోపి మూర్తి ✷ రాయకుదురులో అగ్ని ప్రమాదం ✷ నరసాపురంలో గోవా మద్యం కేసులో నలుగురు అరెస్ట్✷ ఇరిగేషన్కు అధిక నిధులు: మంత్రి నిమ్మల ✷ ఆచంటలో కుంకుమ భరిణీల కోసం బారులు తీరిన జనం
News February 28, 2025
ఆచంట: కుంకుమ భరిణిల కోసం బారులు తీరిన భక్తులు

శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడవ రోజు ఆచంటలో ఏటా మహిళ భక్తులకు స్వామి అమ్మవార్ల వద్ద పూజ చేసిన కుంకుమ భరిణిలను అందించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయం వద్ద కుంకుమ భరిణిల కోసం పెద్ద ఎత్తున చుట్టూ పక్కల గ్రామాల నుంచి మహిళలు భారీగా తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం మహిళలతో కిక్కిరిసింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.