News February 7, 2025

పాచిపెంటలో యువకుడి మృతి

image

పాచిపెంట మండలం పీ.కొనవలస ఘాట్ రోడ్డులో గురువారం స్కూటీని లారీ ఢీ కొట్టడంతో ఒడిశా రాష్ట్రం పొట్టంగికి చెందిన డి.కృష్ణ సుందరి మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. ఒడిశా నుంచి సిమెంట్ లోడుతో సాలూరు వైపు వస్తున్న లారీ స్కూటీని ఢీ కొట్టి లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో స్కూటీపై వెళుతున్న ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. లారీ క్లీనర్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 7, 2025

కడప: విచారణ అధికారి ఎదుట హాజరైన దస్తగిరి

image

తనని జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ ఇబ్బంది పెట్టారని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కడప జైలులో ఇవాళ విచారణ అధికారి రాహుల్ శ్రీరాం ఎదుట దస్తగిరి హాజరయ్యారు. ఫిర్యాదులో డాక్టర్ చైతన్య రెడ్డి తనని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. దస్తగిరి తర్వాత చైతన్య, ప్రకాశ్ విచారణకు హాజరుకానున్నారు.

News February 7, 2025

NZB: మృత్యువులోనూ వీడని స్నేహం

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద నిన్న ఎదురెదురుగా ఆటో, లారీ ఢీకొని మాక్లూర్‌కు చెందిన <<15383679>>ఇద్దరు మృతిచెందిన<<>> సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో మృతిచెందిన ఇంతియాజ్, వెల్డింగ్ పని చేసే ఫర్హాన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు అని మృతుల బంధువులు తెలిపారు. కాగా ఫర్హాన్‌కు వివాహమవగా 3నెలల పాప కూడా ఉందన్నారు.మృత్యువులోనూ వారి స్నేహం వీడలేదని కన్నీటి పర్యంతమయ్యారు.గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 7, 2025

బెంగుళూరు బయలుదేరిన వైఎస్ జగన్ 

image

మాజీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం బెంగుళూరు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్ అక్కడి నుంచి బెంగుళూరు ప్రయాణమయ్యారు. కాగా జగన్‌ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోగా వారికి నమస్కరించిన ఆయన బెంగుళూరు పయనమయ్యారు. 

error: Content is protected !!