News December 1, 2024
పాడి పశువుల పెంపకానికి చేయూత: భద్రాద్రి కలెక్టర్
పాడి పశువుల పెంపకానికి మరింత చేయూతను అందిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయాల జాతీయ సేవా పథకంలో భాగంగా పశు వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పాడి పశువుల పెంపకం అనేది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ దాని ద్వారా లాభాలను అర్జించవచ్చని తెలిపారు.
Similar News
News December 2, 2024
రామయ్య దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
పోలి పాడ్యమి సందర్భంగా రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులతో భద్రగిరి పోటెత్తింది. గత నెల రోజుల నుండి కార్తీక మాసం సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈ రోజు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులందరికీ స్వామి వారి తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాద అవకాశాన్ని కల్పించామన్నారు.
News December 2, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి పొంగులేటి పర్యటనలో భాగంగా జూలూరుపాడు, కూసుమంచి మండలాల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. కావున సంబంధిత అధికారులు గమనించి సకాలంలో హాజరు కావాలని కోరారు.
News December 2, 2024
ఈనెల 14న వాజేడు SI ఎంగేజ్మెంట్.. ఇంతలోనే ఇలా!
వాజేడు ఎస్ఐ హరీశ్ తన<<14767070>> రివాల్వర్‌తో కాల్చుకొని<<>> మృతి చెందిన ఘటన తెలిసిందే. కాగా, ఈనెల 14న హరీశ్ ఎంగేజ్మెంట్ జరగనుందని స్థానికులు తెలిపారు. అంతేకాక ఎంగేజ్మెంట్‌కు సంబంధించి షాపింగ్ చేయాల్సి ఉందని, తన స్నేహితులతో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇంతలో ఆత్మహత్యకు పాల్పడడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.