News February 5, 2025

పాడేరు: ‘ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు’

image

శాసన మండలి ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ MLC, పట్టభద్రుల MLC ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో బుధవారం జూమ్ సమావేశం నిర్వహించారు. ఈనెల 3వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ MLC, గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతోందన్నారు.

Similar News

News March 14, 2025

కామారెడ్డి బిడ్డ.. 3 GOVT జాబ్స్ సాధించారు..!

image

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లి గ్రామానికి చెందిన సంతోష్ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2019లో అటవీ శాఖలో బీట్ అధికారిగా కొలువులో చేరారు. ఆ కొలువు చేస్తూనే.. జేఎల్‌కు సిద్ధమయ్యారు. అంతలోనే గ్రూప్-4 పరీక్ష రాసి.. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ అయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో జేఎల్ సాధించారు. బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోస్టింగ్ వచ్చింది.

News March 14, 2025

ప్రముఖ నటుడు కన్నుమూత

image

బాలీవుడ్ నటుడు దేబ్ ముఖర్జీ (83) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. అధికార్, జో జీతా వోహీ సికందర్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఆయన కుమారుడు అయాన్ ముఖర్జీ హిందీ సినీ పరిశ్రమలో దర్శకుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్-2’ను డైరెక్ట్ చేస్తున్నారు.

News March 14, 2025

హోలీ సందర్భంగా నేడు ప్రజావాణికి సెలవు

image

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య తెలిపారు. దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి ఈ నెల 18న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని దివ్య సూచించారు.

error: Content is protected !!