News April 4, 2025

పాడేరు: తాగునీటి సమస్య పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్లు

image

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ దినేశ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లాలోని 3 ఐటీడీఏల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. తాగునీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులను ప్రతిరోజూ పర్యవేక్షిస్తామన్నారు. కలెక్టరేట్‌లో 18004256826, పాడేరు ఐటీడీఏలో 8935250833, రంప 18004252123, చింతూరు 8121729228 నంబర్లు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News April 12, 2025

పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ముగ్గురు కోనసీమ నేతలు

image

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీని శనివారం పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. నూతన కమిటీలో కోనసీమ జిల్లాకు ప్రాధాన్యం కల్పించారు. ఈ జిల్లాకు చెందిన ముగ్గురికి స్థానం కల్పించారు.  పిల్లి సుభాష్ చంద్రబోస్,  తోట త్రిమూర్తులు, పినిపె విశ్వరూప్ కు అవకాశం కల్పించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

News April 12, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞బండి ఆత్మకూరులో ఇంటర్ ఫెయిల్ కావడంతో మరో విద్యార్థి ఆత్మహత్య☞అన్నమయ్య జిల్లా DRDC సమావేశంలో మంత్రి బీసీ☞ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థుల ప్రతిభ☞నంద్యాల మున్సిపల్ కార్యాలయం మార్పునకు రంగం సిద్ధం☞మహానందిలో ఒకేరోజు 15 పెళ్లిళ్లు☞మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే గౌరు చరిత ☞బాదంపప్పుపై ఆంజనేయస్వామి చిత్రం: చింతలపల్లె కోటేశ్

News April 12, 2025

మత విద్వేషాలను రెచ్చగొట్టుతున్న భూమన: కాకర్ల

image

మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉదయగిరి MLA కాకర్ల సురేశ్ విమర్శలు గుప్పించారు. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోమరణాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా టీటీడీ భక్తుల మనోభావాలను ఆయన దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. 

error: Content is protected !!