News January 25, 2025

పాడేరు: బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్న కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ కు 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ చేతుల మీదుగా తీసుకున్నారు. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలలో ఈ అవార్డును కలెక్టర్ తీసుకున్నారు. గత ఏడాది ఓటర్ల జాబితా తయారీలో, సమ్మరీ రివిజన్ లో విశేష కృషి చేసినందుకు కలెక్టర్‌కు ఈ అవార్డును అందుకున్నారు.

Similar News

News March 13, 2025

సలహాలు, సూచ‌న‌లు ఇవ్వండి: విశాఖ కలెక్టర్

image

ఈఆర్వో, డీఈవో, సీఈవో స్థాయిలో పరిష్కారంకాని ఏవైనా సమస్యలపై భారత ఎన్నికల సంఘానికి నేరుగా సూచ‌న‌లు ఇవ్వొచ్చ‌ని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ‌, ప్రాంతీయ‌ రాజ‌కీయ పార్టీల‌కు ఆహ్వానం తెలుపుతూ ఎన్నిక‌ల సంఘం వెసులుబాటు కల్పించిందని కలెక్టర్ వివరించారు. రాజ‌కీయ పార్టీల‌కు విడివిడిగా ఎన్నిక‌ల సంఘం లేఖలు పంపినట్లు పేర్కొన్నారు.

News March 13, 2025

‘వైసీపీ ఉనికి కోసమే యువత పోరు చేపట్టింది’

image

నంద్యాల: రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ కేవలం ఉనికి కోసమే యువత పోరు కార్యక్రమం చేపట్టిందని యూనివర్సల్ స్టూడెంట్ యూత్ యూనియన్ అధ్యక్షుడు ముద్దం నాగ నవీన్ మండిపడ్డారు. యువత జీవితాలను నాశనం చేయాలని జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడన్నారు. తన హయాంలో నిరుద్యోగ శాతం పెంచి.. ఇప్పుడు ఫీజు పోరు చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 13, 2025

స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఎస్పీ సమీక్ష

image

సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలు, క్రైం అగనెస్ట్ ఉమెన్, తదితర నేరాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు భాగస్వామ్యులు కావాలని ఎన్జీవోల ప్రతినిధులకు ఎస్పీ జగదీశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమావేశం నిర్వహించారు. సమష్టిగా కృషి చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ కోరారు.

error: Content is protected !!