News April 25, 2024
పాణ్యంలో గెలుపునకు వారే కీలకం

పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండల పరిధిలో కర్నూలు కార్పొరేషన్‌లోని 16 వార్డులు కలిపి 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. కాగా పాణ్యం మండలంలో 36,893 ఓటర్లు, ఓర్వకల్లు మండలం 48,121, గడివేముల 34,411, కల్లూరు మండలంలో 2,03,068 మంది ఓటర్లతో కలిపి మెుత్తం ఓటర్లు 3,22,493 ఉన్నారు. పాణ్యం నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపులో కల్లూరు మండల ఓటర్లు కీలక పాత్ర వహించనున్నాయి.
Similar News
News April 23, 2025
నేడే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 23, 2025
ఉపాధి పనులపై కర్నూలు కలెక్టర్ కీలక ఆదేశాలు

వేసవిలో ముమ్మరంగా ఉపాధి పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎంపీడీవోలను ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 90 శాతం లక్ష్యాన్ని సాధించేలా కృషి చేయాలని చెప్పారు. మంగళవారం ఉపాధి హామీ, హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయాల సేవల అంశాలపై జిల్లా అధికారులు, మండల స్పెషల్ అధికారులతో కలెక్టర్ ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
News April 22, 2025
కర్నూలు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

➤పత్తికొండ యువతికి 990 మార్కులు➤ విషాదం.. తండ్రీకూతురి ప్రాణం తీసిన లారీ➤ రేపే పదో తరగతి రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు➤ కర్నూలు: ఆర్టీసీ బస్సులో పొగలు ➤ కర్నూలు జిల్లాలో ఆశాజనకంగా పత్తి ధరలు➤ కర్నూలు జిల్లా ఎస్పీ హెచ్చరికలు➤ ఉపాధి పనులపై కర్నూలు కలెక్టర్ కీలక ఆదేశాలు➤ గూడూరులో ఇద్దరు కార్మికుల మృతి➤ డిప్యూటీ డీఈవోగా ఐజీ రాజేంద్రప్రసాద్ బాధ్యతలు