News March 3, 2025

పాత చింతకాయ పచ్చడిలా వాగుతున్న CM: హరీశ్ రావు

image

CM రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడిలా వాగుతున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారెంటీల గురించి మాట్లాడడం చేతకాదని విమర్శించారు. పాలమూరుకు రేవంత్ రెడ్డి చేసిందేమీలేదన్నారు.

Similar News

News March 4, 2025

తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాలు ద్వారా రూ.8,17,320, VIP దర్శనాలు రూ.1,80,000, కార్ పార్కింగ్ రూ.1,62,000, వ్రతాలు రూ.1,13,600, కళ్యాణ కట్ట రూ.90,000, సువర్ణ పుష్పార్చన రూ.75,200, యాదరుషి నిలయం రూ.44,860, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.16,77,910 ఆదాయం వచ్చిందన్నారు.

News March 4, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 4, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 5.20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.24 గంటలకు
ఇష: రాత్రి 7.36 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 4, 2025

నల్గొండ: శ్రీపాల్ రెడ్డికి 13,969 ఓట్లు

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. పీఆర్టియూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డితో పోటీపడి 13,969 ఓట్లు సాధించారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఆసాంతం ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. చివరకు మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్‌తోనే శ్రీపాల్ రెడ్డి గెలుపు ఖరారైంది.

error: Content is protected !!