News May 22, 2024
పామాయిల్ తోటల్లో గజరాజుల గుంపు
గరుగుబిల్లి మండలం సుంకి గ్రామ సమీపంలో ఉన్న పామాయిల్ తోటల్లో గజరాజుల గుంపు సంచరిస్తోంది. దీంతో సమీప ప్రాంత ప్రజలంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు ఏ క్షణాన ఎవరిపై దాడికి వస్తుందోనన్న భయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో పంటలు వేసేందుకు రైతులు పంట పొలాలను దుక్కులు వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉంటే తక్షణమే ఏనుగులను ఈ ప్రాంతాల నుంచి తరలించాలని కోరుతున్నారు.
Similar News
News November 28, 2024
గంజాయి రవాణాపై 289 కేసులు: DIG
గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్న 1972 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని డీఐజీ గోపీనాథ్ జెట్టీ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఇప్పటివరకు గంజాయి రవాణాపై 289 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు డైనమిక్ చెక్ పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 స్పెషల్ టీములను గంజాయి రవాణా అరికట్టేందుకు నియమించాన్నారు.
News November 28, 2024
దత్తత తీసుకున్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి: మంత్రి
దత్తత తీసుకున్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గురువారం ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఫోస్టర్ అడాప్షన్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి చేతులు మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు కావలసిన వారు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలన్నారు. చిన్న పిల్లలను అమ్మినా,కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తప్పవని అన్నారు.
News November 28, 2024
కేంద్ర మంత్రితో విజయనగరం ఎంపీ భేటీ
ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ అప్పలనాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పలు రోడ్లు అభివృద్ధి చెయ్యాలని కోరారు. నెల్లిమర్ల నుంచి రామతీర్థం మీదుగా రణస్థలం వరుకు రహదారిని అభివృద్ధి చేయాలని, విజయనగరం-కొత్తూరు NH-16ను 4 లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని, పాలకొండ, రామభద్రపురం, రహదారులను 4లైన్ల రహదారిగా మార్చాలని వినతిపత్రం ఇచ్చారు.