News November 22, 2024
పార్టీలో పనిచేసిన మరికొందరికి పదవుల కోసం కృషిచేస్తా: తిక్కారెడ్డి
టీడీపీలో పనిచేసిన మరికొందరికి ప్రభుత్వ పదవులు ఇప్పించేందుకు కృషిచేస్తానని కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ పదవులు పొందిన వారిని సన్మానించారు. కుడా ఛైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కురువ ఫెడరేషన్ ఛైర్మన్‌గా దేవేంద్రప్ప, వాల్మీకి ఫెడరేషన్ ఛైర్ పర్సన్‌గా బొజ్జమ్మకు అవకాశం లభించిందన్నారు. కార్పొరేషన్లలో సభ్యులు మరికొందరికి వచ్చాయన్నారు.
Similar News
News November 23, 2024
డ్రోన్ సిటీతో వేల మందికి ఉద్యోగ అవకాశాలు: మంత్రి బీసీ
ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటుతో వేల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన డ్రోన్ పాలసీపై అసెంబ్లీలో ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సుమారుగా 100 డ్రోన్ కంపెనీలు ప్రారంభించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. తద్వార అనేక మందికి ఉపాధి కల్పించవచ్చని మంత్రి తెలిపారు.
News November 23, 2024
నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత
శ్రీశైల క్షేత్రంలో మళ్లికార్జున స్వామి స్పర్శదర్శనం శని, ఆది, సోమవారాల్లో నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఈ మూడు రోజుల్లో ఉచిత స్పర్శదర్శన సేవలు నిలిపివేసినట్లు చెప్పారు. తిరిగి మంగళవారం నుంచి శుక్రవారం వరకు యథావిధిగా స్పర్శ దర్శనం సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.
News November 23, 2024
రోజా పూల తోటను పరిశీలించిన కలెక్టర్
మహానంది మండలం గాజులపల్లెలో రోజా పూల తోటను నంద్యాల కలెక్టర్ రాజకుమారి గణియా పరిశీలించారు. సాగు చేస్తున్న విధానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. పూల తోట చక్కగా ఉందని రైతును ప్రశంసించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులు సాధించి ఆర్థిక ప్రయోజనం పొందాలని కోరారు.