News April 17, 2025
పార్వతీపురం: 24 గంటల్లో 103 MM వర్షపాతం నమోదు

పార్వతీపురం మన్యం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 103 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా మక్కువ మండలంలో 22.6, గరుగుబిల్లిలో 18.6, పార్వతీపురంలో 14.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. సాలూరు, జియమ్మవలస, కురుపాం, వీరఘట్టం మండలాల్లో అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సగటున 6.9 MM వర్షం కురిసనట్లు ధ్రువీకరించారు.
Similar News
News April 20, 2025
త్వరలో 3,038 పోస్టులకు నోటిఫికేషన్: మంత్రి

TGSRTCలో త్వరలో 3,038 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందులో డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్) 84, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్) 114, డిపో మేనేజర్ 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 18, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్) 23, సెక్షన్ ఆఫీసర్(సివిల్) 11, అకౌంట్ ఆఫీసర్ 6, మెడికల్ ఆఫీసర్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ 7 పోస్టులున్నాయి.
News April 20, 2025
రాజమండ్రి: పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో ఉద్రిక్తత

పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కొవ్వొత్తులతో నివాళులర్పిస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు హర్షకుమార్‌ను అదుపులోకి తీసుకుని జీపులో తీసుకెళ్లారు. క్రైస్తవులు, వివిధ సంఘాల నేతలు పాస్టర్ ప్రవీణ్‌కి నివాళులర్పించారు. పరిస్థితి ఉద్రిక్తత అవ్వడంతో నలుగురు నేతలను అదుపులోకి తీసుకుని రాజనగరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
News April 20, 2025
రాజంపేట: ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి

రాజంపేటలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గుడి తండాకి చెందిన మాలోత్ అనిత, గణేశ్‌ల చిన్న కుమారుడు చిన్నా శనివారం సాయంత్రం ఇంటి ముందు స్నేహితులతో కలసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాక్టర్ గేర్లను మార్చగా న్యూట్రల్‌లోకి వెళ్లింది. వెనక పల్లంగా ఉండటంతో ట్రాక్టర్ టైర్ చిన్నాపై నుంచి వెళ్లింది. గాయపడిన చిన్నాను కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.