News March 10, 2025

పార్వతీపురం: 372 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 372 గైర్హాజరు అయినట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా సోమవారం 34 పరీక్ష కేంద్రాల్లో 7,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 7,508 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 4,954 మంది జనరల్ విద్యార్థులకు గాను 4,812 మంది విద్యార్థులు హాజరుయ్యారు. 2,926 ఒకేషనల్ విద్యార్థులకు గాను 2,696 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.

Similar News

News March 10, 2025

శ్రీకాకుళం: జీరో పావ‌ర్టీ పీ-4 విధానం ప్రారంభం- కలెక్టర్

image

స్వర్ణాంధ్ర @ 2047 కార్యాచరణలో భాగంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన జీరో పావర్టీ-పీ4 విధానం ప్రక్రియ జిల్లాలో మొదలైందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్ (పీ4) విధానానికి ఉగాది నుంచి ప్రారంభం కానుందని కలెక్టర్ తెలిపారు.

News March 10, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 140 మంది గైర్హాజరు.!

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెట్-2 ప్రశ్నాపత్రంతో పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈఓ రఘునాథ రెడ్డి సోమవారం తెలిపారు. పరీక్షలకు జనరల్ విద్యార్థులు 6339 మందికి గానూ.. 6236మంది, ఒకేషనల్ విద్యార్థులు 1144 మందికి గానూ 1107 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 140 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.

News March 10, 2025

కేంద్రమంత్రి నాలిక అదుపులో పెట్టుకోవాలి: సీఎం స్టాలిన్

image

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ధర్మేంద్ర తనను తాను రాజు అనుకుంటున్నారు. ఆయన నాలిక అదుపులో పెట్టుకోవాలి. ‘పీఎం శ్రీ’ పథకాన్ని మేమెప్పుడూ ఒప్పుకోలేదు. కానీ మేం ఒప్పుకుని మాట మార్చామంటూ ఆయన అవాస్తవాలు చెబుతున్నారు. మీరు తమిళనాడు విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధుల్ని ఇస్తారా లేదా ముందు అది చెప్పండి’ అని ప్రశ్నించారు.

error: Content is protected !!