News March 4, 2025

పార్వతీపురం: అందుబాటులో పదో తరగతి హాల్ టికెట్లు

image

పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. తిరుపతి నాయుడు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, మీడియం, విద్యార్థి ఫోటో, సంతకం, సబ్జెక్టు వివరాలను నిశితంగా పరిశీలించల్లన్నారు. హాల్ టికెట్‌ల్లో ఏవైనా తప్పులు ఉంటే గుర్తించి తక్షణమే పరీక్షల విభాగాన్ని సంచాలకులకు సమాచారం అందించాలన్నారు. www.bse.ap.in వెబ్సైట్‌ను పరిశీలించాలని సూచించారు.

Similar News

News March 4, 2025

టెలిఫోన్‌కు 75 ఏళ్లు పడితే.. థ్రెడ్స్‌కు 5 రోజులే!

image

టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోంది. కొత్తగా ఏది వచ్చినా దాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో టెలిఫోన్ వినియోగించే వారి సంఖ్య 100 మిలియన్లకు చేరేందుకు 75 ఏళ్లు పడితే.. Threads 5 రోజుల్లో & ChatGPT 2 నెలల్లోనే ఈ ఘనత సాధించాయి. మొబైల్ ఫోన్‌కు 16 ఏళ్లు, ట్విటర్‌కు 5 ఏళ్లు, ఫేస్‌బుక్‌కి 4.5 ఏళ్లు, వాట్సాప్‌కు 3.5 ఏళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 2.5 ఏళ్లు పట్టింది.

News March 4, 2025

అంగన్వాడీల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం

image

పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణికి అంగన్వాడీలు వినతి పత్రాన్ని మంగళవారం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 42 గంటల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. 10వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News March 4, 2025

పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

image

పాకిస్థాన్ టీ20 కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్ కోసం రిజ్వాన్‌ను తప్పించి సల్మాన్ అలీ అఘాకు పగ్గాలు అప్పగించింది. ఈ సిరీస్‌కు రిజ్వాన్‌తో పాటు మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్‌ను పక్కనపెట్టింది. అయితే వన్డేలకు మాత్రం రిజ్వాన్ కెప్టెన్సీ చేస్తారని వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.

error: Content is protected !!