News February 25, 2025
పార్వతీపురం: ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

స్థానిక మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు నిక్షిప్తంగా భద్రపరచిన గోడౌన్‌ను పీరియాడిక్ తనిఖీల్లో భాగంగా అక్కడ భద్రత, గోడౌన్‌కు వేసిన సీల్‌లను నిశితంగా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు.
Similar News
News February 25, 2025
ఏపీ అసెంబ్లీ వాయిదా

ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఈ తీర్మానానికి ఆమోదం లభించినట్లు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ తర్వాత ఫిబ్రవరి 28కి సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
News February 25, 2025
భారీ భద్రతలతో పోలింగ్: కలెక్టర్

భారీ భద్రతలతో ఎమ్మెల్సీ ఎన్నిలక పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. 8 మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 37 మంది ఎస్సైలు, 69 మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, 221 మంది పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర భధ్రతా సిబ్బందితో కలిసి 477 మందిని పోలింగ్ ప్రక్రియకు వినియోగించనున్నట్లు తెలిపారు. 70 మంది జోనల్ అధికారులను, 99 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు.
News February 25, 2025
మాదిగ అమరవీరుల కుటుంబాల కాళ్లు కడిగిన మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరుగుతున్న మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కులాల్లో అసమానతల వల్లే ఆందోళనలు మొదలయ్యాయన్నారు. హక్కుల సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో అసువులు బాసిన అమరులకు ఈరోజు నివాళులర్పిస్తున్నామన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యుల కాళ్లు కడిగారు. ఈ సందర్భంగా వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.