News February 24, 2025
పార్వతీపురం: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం

పార్వతీపురం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 2,333 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. అందులో పురుషులు 1574, మహిళలు 759 మంది. అత్యధికంగా పార్వతీపురంలో 636, సాలూరులో 250 మంది ఉన్నారు. అత్యల్పంగా పాచిపెంటలో 34 మంది ఉన్నారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు 18 మంది POలు, 18 APOలు, 36 OPOలు, 18 మంది ఎంఓలను నియమించినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News February 24, 2025
SSS: కలెక్టర్ కార్యాలయానికి 233 అర్జీలు

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 233 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు మండలాల నుంచి సమస్యలపై కలెక్టర్‌కు ప్రజలు అర్జీలు ఇచ్చారు. పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు సమగ్ర విచారణ జరిపి సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.
News February 24, 2025
అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు: జగన్

AP: సభలో చర్చించేందుకు సమయం ఇవ్వాల్సి వస్తుందనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు ఎక్కడా తగ్గం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. కళ్లు మూసి తెరిచేలోగా జమిలి ఎన్నికలు వస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News February 24, 2025
జియో క్రికెట్ డేటా ప్యాక్.. 90 రోజులు ఉచితంగా!

క్రికెట్ అభిమానుల కోసం జియో సరికొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా మారిన విషయం తెలిసిందే. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ, IPL టోర్నమెంట్ కోసం డేటాతో పాటు సబ్‌స్క్రిప్షన్ ఉండే ప్యాక్ తీసుకొచ్చింది. రూ.195 చెల్లిస్తే 15GB డేటాతో పాటు 90 రోజుల పాటు ‘JIO HOTSTAR’ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.