News April 14, 2025
పార్వతీపురం కలెక్టరేట్‌లో ఘనంగా అంబేడ్కర్ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. డా. బి.ఆర్. అంబేడ్కర్ తాత్విక చింతన దేశాన్ని నడిపిస్తుందన్నారు. దేశం ఏకతాటిపై నడవడానికి కారణం అంబేడ్కర్ దూర దృష్టి మాత్రమే అన్నారు.
Similar News
News December 21, 2025
సంక్రాంతి వస్తోంది.. చిత్తూరు జిల్లాలో జాగ్రత్త

చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. మహిళలు ఉదయాన్నే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడుతున్నారు. మగవాళ్లు అప్పుడే కోడిపందేలకు తెరలేపారు. పోలీసులు అయితే సైలెంట్‌గా ఉండరు కదా? వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. బైరెడ్డిపల్లి(M) నెల్లిపట్ల పంచాయతీ కక్కనూరు సమీపంలో కోడిపందెం స్థావరంపై SI చందన ప్రియ దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుని 18బైకులు, 3కోళ్లు సీజ్ చేశారు. సో కోడిపందేలకు వెళ్లకండి.
News December 21, 2025
SRD: ఇంటర్ పూర్తి.. 21 ఏళ్లకే సర్పంచ్

ఖేడ్ మండలంలోని లింగ నాయక్ పల్లి గ్రామపంచాయతీ 2024లో ఏర్పడింది. గ్రామంలో 279 ఓటర్లు ఉన్నారు. మొదటిసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన 21 ఏళ్ల తంపులూరి శివలక్ష్మి సమీప ప్రత్యర్థి పుల్లయ్య గారి లక్ష్మిపై 84 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శివలక్ష్మి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. కాగా ఖేడ్ మండలంలో అత్యంత తక్కువ ఉన్న వయస్సు సర్పంచ్‌గా శివలక్ష్మి రికార్డ్ సృష్టించింది.
News December 21, 2025
100% విద్యార్థులు స్కూల్‌కి రావాలి: కలెక్టర్

బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాఠశాలల్లో వంద శాతం విద్యార్థుల హాజరు పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సమీక్షలో 10వ తరగతి 100‑రోజుల ప్రణాళికను అమలుచేయాలని, అలాగే “తల్లికి వందనం” పథకం పెండింగ్ అంశాలను పూర్తిచేయాలని సూచించారు. సమీక్షలో డీఈఓ శ్రీనివాస్, డీఎల్‌డీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.


