News April 12, 2025

పార్వతీపురం: ‘గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత’

image

పార్వతీపురం జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, ఇచ్చిన లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతీ మండలంలో నెలకు 1,000 గృహాలు పూర్తిచేయాలని లక్ష్యాలను నిర్దేశించామని, కనీసం 500 గృహాలైన పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మే నెలలోగా 1,600 గృహాలు పూర్తిచేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 24, 2026

కీలక మీటింగ్‌కు గైర్హాజరు.. స్పందించిన శశి థరూర్

image

కాంగ్రెస్ కీలక సమావేశానికి గైర్హాజరుపై వస్తున్న వార్తలను ఆ పార్టీ MP శశి థరూర్ తోసిపుచ్చారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగ వేదికలపై చర్చించబోనన్నారు. ‘రాజకీయ ప్రకటనలు చేయడానికి రాలేదు. సొంత పార్టీ నాయకులతో చర్చించాల్సిన సమస్యలపై పబ్లిక్‌లో మాట్లాడను. పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లినప్పుడు పార్టీ నాయకులతో మాట్లాడే ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నాను’ అని కేరళ సాహిత్య ఉత్సవంలో చెప్పారు.

News January 24, 2026

ఏయూ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఏయూ పరిధిలోని రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వీటిలో ఎంబీఏ మూడవ, మొదటి సెమిస్టర్, బీటెక్, ఎంటెక్ మొదటి, 2వ, 6వ సెమిస్టర్, న్యాయవిద్య మొదటి, 4వ, 5వ, 6వ సెమిస్టర్, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బోటనీ, హోమ్ సై‌న్స్, బీఈడీ మొదటి, రెండో సెమిస్టర్ కోర్సులకు సంబంధించిన రీవాల్యుయేషన్ ఫలితాలను కొద్దిసేపటి క్రితం అధికారులు విడుదల చేశారు. వీటిని ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

News January 24, 2026

దివ్యాంగులకు త్వరగా ‘ఆసరా’ పెన్షన్లు: కలెక్టర్

image

అర్హులైన దివ్యాంగులకు త్వరితగతిన ఆసరా పెన్షన్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హామీ ఇచ్చారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. పిల్లల తల్లిదండ్రులు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘భవిత’ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.