News March 10, 2025

పార్వతీపురం: దరఖాస్తుల ఆహ్వానం

image

సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎన్ తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లాలో 15 మండలాల ZPHS, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత గల ఉపాధ్యాయులు 12వ తేదీలోగా డీఈఓ కార్యాలయానికి వివరాలు తెలియజేయాలన్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News March 10, 2025

కేసీఆర్ అప్పులు, తప్పులను అసెంబ్లీలో పెడతాం: CM రేవంత్

image

TG: తాము ప్రతిపక్షం లేని రాజకీయం చేయాలనుకోవడం లేదని సీఎం రేవంత్ అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికే ఎక్కువ సమయం ఇస్తున్నామని తెలిపారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ‘జీతభత్యం తీసుకుని పని చేయని వ్యక్తి కేసీఆర్. ఆయన చేసిన అప్పులు, తప్పులను అసెంబ్లీలో పెడతాం. KCRకు భయపడి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదు. మూసీకి నిధులు తెస్తే ఆయనకు సన్మానం చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.

News March 10, 2025

బాపులపాడులో అధిక ఉష్ణోగ్రతలు.. తగ్గని వేడి.!

image

కృష్ణా జిల్లా గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నేడు బయట ఎండ తీవ్రత కనిపించకపోయినా, ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గలేదు. బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో 35 డిగ్రీలు, గన్నవరంలో 36 డిగ్రీలు నమోదయ్యాయి. పైగా గాలిలేని వాతావరణం ఉక్కపోతను మరింత పెంచింది. “గాలి లేక అసలే ఉమ్మటేసింది!” అని స్థానికులు అంటున్నారు. 

News March 10, 2025

’50 శాతం స్థానాలు ఓబీసీలకు కేటాయించాలి’

image

దేశ జనాభాలో ఓబీసీల సంఖ్య 50 శాతానికి మించి ఉన్నందున, మొత్తం పార్లమెంటు స్థానాలలో 50 శాతం ఓబీసీలకు కేటాయించాలని బీసీ సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు భోగి రమణ డిమాండ్ చేశారు. డాబాగార్డెన్స్‌లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్‌లో ఛలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈనెల 12,13 తేదీలలో న్యూఢిల్లీలో ఓబీసీ మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఉందని తెలిపారు.

error: Content is protected !!