News March 30, 2025

పార్వతీపురం: పచ్చని చెట్టు కొమ్మలే బిడ్డకు గొడుగుగా..

image

తన వేలే ఊతగా నడక నేర్చిన బిడ్డ ఎండకు అల్లాడుతుంటే ఏ తల్లి అయినా తట్టుకోగలదా? అందుకే కుమారుడికి ఎండ సెగ తగలకుండా చెట్టు కొమ్మలనే గొడుగుగా మార్చింది. అమ్మ ప్రేమకు అద్దం పట్టే ఈ దృశ్యం కురుపాం మండలం తెన్నుఖర్జ రహదారిలో కనిపించింది. ఓ గిరిజన మహిళ తన మూడేళ్ల బిడ్డకు ఎండ నుంచి రక్షణ కోసం పచ్చని చెట్టు కొమ్మను అడ్డుగా ఉంచగా.. ఆ పిల్లాడు తల్లి ప్రేమ నీడలో ముందుకు నడిచిన దృశ్యం చూపరులను ఆకర్షించింది.

Similar News

News April 2, 2025

ప్రపంచానికే సాయం.. భారత్ విపత్తు దౌత్యం

image

ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే విపత్తు సంభవించిందంటే మొట్ట మొదటిగా భారతే స్పందిస్తుంది. 1959లో టిబెట్ శరణార్థులకు ఆశ్రయం కల్పించడం నుంచి నిన్న మొన్నటి మయన్మార్‌ భూకంపంలో ‘ఆపరేషన్ బ్రహ్మ’ వరకు భారత్ చేసిన సాయం అంతాఇంతా కాదు. దీన్ని ‘విపత్తు దౌత్యం’గా విదేశీ వ్యవహారాల నిపుణులు వివరిస్తున్నారు. సాధారణ దౌత్యంతో కుదరని బలమైన సంబంధాల్ని ఈ దారిలో భారత్ సాధిస్తోందని కొనియాడుతున్నారు.

News April 2, 2025

కరోనా బారినపడ్డ పాక్ అధ్యక్షుడు

image

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనను కరాచీలోని ఓ ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉంచారు. జర్దారీ జ్వరంతో పాటు శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కరోనా నిర్ధారణకు ముందు ఆయన ఈద్ ప్రార్థనల్లో పాల్గొనడంతో పాటు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు.

News April 2, 2025

IPL: టాస్ గెలిచిన GT

image

RCBతో మ్యాచులో టాస్ గెలిచిన GT బౌలింగ్ ఎంచుకుంది.
RCB: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, రజత్(C), లివింగ్‌స్టోన్, జితేశ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్
GT: గిల్(C), బట్లర్, సుదర్శన్, ఇషాంత్ శర్మ, షారుఖ్ ఖాన్, తెవాటియా, సాయి కిశోర్, రషీద్ ఖాన్, అర్షద్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

error: Content is protected !!