News March 29, 2025
పార్వతీపురం: పదవ తరగతి విద్యార్థులకు అలెర్ట్

ఈనెల 31వ తేదిన జరగబోయే పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుందని DEO ఎన్. తిరుపతి నాయుడు శనివారం తెలిపారు. ప్రభుత్వం ఈనెల 31న రంజాన్ సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు మార్పు చేసినట్టు తెలిపారు. కావున పరీక్షా సిబ్బంది అందరూ గమనించి, అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేయాలని సూచించారు.
Similar News
News April 3, 2025
పాలమూరు: ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పాలమూరు కురుమ సంఘం కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ.. గొర్రె కాపర్ల సామాజికవర్గానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని తెలిపారు. మాదారం కృష్ణ, ఎస్.వెంకటేశ్, కొల్లంపల్లి శ్రీనివాస్, రామచందర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
News April 3, 2025
సంగారెడ్డి: శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఈవో

సంగారెడ్డి మండలంలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైనర్స్ చెప్పినటువంటి అంశాలను శ్రద్ధగా విని విద్యార్థులకు ఉపయోగపడేలా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ విద్యాసాగర్, డీఆర్పిలు పాల్గొన్నారు.
News April 3, 2025
3వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

భారీ భూకంపం ధాటికి మయన్మార్‌లో మృతుల సంఖ్య 3,085కు చేరినట్లు సైనిక ప్రభుత్వం వెల్లడించింది. 4,715 మంది గాయపడ్డారని, 341 మంది గల్లంతయ్యారని తెలిపింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం మృతుల సంఖ్య ప్రభుత్వం చెప్పినదానికంటే చాలా అధికంగా ఉంటుందని సమాచారం. భూకంప విధ్వంసం కారణంగా 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస నివేదిక పేర్కొంది.