News February 24, 2025
పార్వతీపురం: ‘పీ-4 సర్వేని పక్కాగా చేపట్టాలి’

జిల్లాలో పీ-4 విధానంపై (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్ షిప్) సర్వేను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. మార్చి 8 నుంచి 28వ తేదీ వరకు సర్వే చేయాలని సూచించారు. జిల్లాలో 2,65,000 గృహాలు ఉన్నాయని, వ్యవధి తక్కువగా ఉన్నందున ప్రణాళికబద్దంగా సర్వే పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
Similar News
News February 25, 2025
గంజాయి నిర్మూలనకు కృషి చేయండి: కలెక్టర్

అల్లూరి జిల్లాలో గంజాయి నిర్మూలనకు సంబంధిత శాఖలన్నీ కలసి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎన్కార్డ్ (NCORD) సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ ద్వారా డ్రోన్ల సహాయంతో 274 గ్రామాలు పరిశీలించి, సుమారు 82 ఎకరాలలో గంజాయి సాగును గుర్తించడం జరిగిందన్నారు. ఆయా రైతులను గుర్తించి వారికి గంజాయి వల్ల కలిగే నష్టాలు, దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
News February 25, 2025
అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా పంచకర్ల

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మార్చి 14న పిఠాపురంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ నియోజకవర్గానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబును సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, పీఓసీలు పార్టీ మండల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి.
News February 25, 2025
విశాఖ: మాతృ మరణాలపై సమీక్ష

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో DMHO జగదీశ్వర రావు సోమవారం మాతృ మరణాలపై డిస్ట్రిక్ట్ లెవెల్ ఎం.సి.హెచ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరిలో రేవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి రెడ్డిపల్లిలోని ఒక మాతృ మరణం జరిగిందన్నారు.ఇకపై మాతృ మరణాలు జరగకుండా చూడాలని హెచ్చరించారు. గర్భిణీగా ఉన్నప్పుడే హై రిస్క్ ప్రెగ్నెన్సి గుర్తించి తగిన సలహాలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.