News April 4, 2025
పార్వతీపురం: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

భార్య మందలించిందని ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పార్వతీపురం జిల్లా గరుగుబిల్లి మండలంలో జరిగింది. వల్లరిగుడబ గ్రామానికి చెందిన పలగర్ర పోలి (40)ని మందు తాగొద్దని భార్య మందలించడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. వెంటనే ఆటోలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు పార్వతీపురం అవుట్ పోస్ట్ ASI భాస్కరరావు తెలిపారు.
Similar News
News April 5, 2025
శ్రీరామనవమి వేళ.. వరంగల్ ట్రైసీటీలో పోలీసుల నజర్

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శ్రీరామ మందిరాలతోపాటు, వాడల్లో ప్రజలు జరుపుకునే శ్రీరాముని కళ్యాణ వేడుకలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించాలని వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. రామ మందిరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శోభాయాత్ర సమయంలో పోలీసులు తగు బందోబస్త్ ఏర్పాటు చేయాలన్నారు.
News April 5, 2025
కర్నూలు: 10th విద్యార్థులకు ఉచిత కోచింగ్

కర్నూలు జిల్లా 10th విద్యార్థులకు శుభవార్త. పదో తరగతి పరీక్షలు కంప్లీట్ అయిన విద్యార్థులకు తాండ్రుపాడు ప్రభుత్వ మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ప్రవేశానికి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. శుక్రవారం నుంచి ఈనెల 28 వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తి తెలిపారు. శిక్షణకు వచ్చే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కూడా ఇస్తామన్నారు. వివరాలకు తాండ్రుపాడు కళాశాలను సంప్రదించాలన్నారు.
News April 5, 2025
విశాఖ తీరంలో అమెరికా యుద్ధ విన్యాసాలు

విశాఖ తీరానికి సైనికులతో ఉన్న అమెరికా దేశ యుద్ధ నౌకలు వచ్చాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం భద్రతకు దిక్సూచిగా భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్ 2025 విన్యాసాల్లో పాల్గొనడానికి విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈ నెల ఏడో తేదీ వరకు హార్బర్ ఫేజ్‌లో విన్యాసాలు జరుగుతాయి. అమెరికా యుద్ధనౌక యూఎస్ కంస్టాక్, రాల్స్ జాన్సన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.