News April 3, 2025

పార్వతీపురం: బీసీ కార్పొరేషన్ రుణాలకు రేపు బ్యాంకర్ల ఇంటర్వ్యూలు

image

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుదారులకు ఈ నెల 4న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. పార్వతీపురంలోని మెప్మా కార్యాలయంలో పలు బ్యాంకుల అధికారులు పాల్గొని ఇంటర్వ్యూలు చేస్తారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 15 సచివాలయాల నుంచి 968 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

Similar News

News April 4, 2025

రాజేంద్రనగర్: గృహప్రవేశంలో పాల్గొన్న సీఎం రేవంత్

image

రాజేంద్రనగర్‌లో ఇవాళ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి సోదరుడు ఎలిగంటి వెంకట్‌రెడ్డి గృహప్రవేశ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. సీఎంను మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పలువురు నాయకులు ఉన్నారు.

News April 4, 2025

KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాలు, సహకార శాఖ అధికారులు, వ్యవసాయం, మార్కెటింగ్, గ్రామీణ అభివృద్ధి అధికారులతో కలెక్టర్ ఆశిష్ సాంగ్వ న్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 33 కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. మిగతా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

News April 4, 2025

జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ: భద్రాద్రి కలెక్టర్

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో శుక్రవారం జిల్లా జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం తరలించామని తెలిపారు. ఇప్పటికే ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించామని ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా సక్రమంగా నిర్ణీత సమయంలో రవాణా చేసేలా తగు జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.

error: Content is protected !!