News February 27, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 60.65 శాతం పోలింగ్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 60.65 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2,333 మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను 1415 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందన్నారు.

Similar News

News December 14, 2025

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో భారీ మార్పులు

image

AP: ఇంటర్ ఫస్టియర్ పరీక్షా విధానంలో బోర్డు మార్పులు చేసింది. గతంలో 6 సబ్జెక్టులు(ఇంగ్లిష్-100, లాంగ్వేజెస్-100, మ్యాథ్స్A-75, మ్యాథ్స్B-75, ఫిజిక్స్-60, కెమిస్ట్రీ-60, బోటనీ-60, జువాలజీ-60) ఉండగా ఈసారి ఐదుకు కుదించింది. ఇంగ్లిష్-100, లాంగ్వేజెస్-100, మ్యాథ్స్-100, ఫిజిక్స్-85, కెమిస్ట్రీ-85, బయాలజీ(బోటనీ+జువాలజీ)-85 మార్కులు ఉంటాయి. సెకండియర్‌లో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి.

News December 14, 2025

బోయిన్‌పల్లి: ఓటర్లకు చేదోడుగా పోలీసు సిబ్బంది

image

పంచాయతీ ఎన్నికలలో పోలీసు సిబ్బంది ఓటర్లకు చేదోడుగా నిలుస్తున్నారు. ఓటు వేయడానికి వచ్చే వృద్ధులు, వికలాంగులను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి సహాయం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రంలోకి ఇతరులకు అనుమతి లేకపోవడంతో వీల్ చైర్లలో వచ్చేవారిని స్వయంగా లోపలికి తీసుకు వెళుతున్నారు. కానిస్టేబుల్ నుండి డీఎస్పీ స్థాయి అధికారి వరకు ఓటర్లకు సహాయం చేస్తుండడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.

News December 14, 2025

చీనీ తోటలకు కలుపు మందులతో ముప్పు

image

చీనీ తోటల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల వల్ల చెట్లలో వైరస్ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల ఎండు తెగులు, వేరుకుళ్లు, పొలుసు పురుగు, నల్లి, మంగు, బంక తెగులు లాంటి చీడపీడలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కలుపు మందులతో తోటల జీవితకాలం తగ్గడంతో పాటు చెట్లు చనిపోతున్నట్లు వ్యవసాయ నిపుణులు గుర్తించారు. ట్రాక్టర్ లేదా కూలీలతో కలుపు తీయిస్తే భూమి గుల్లబారి పంటకు మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.